ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సూపర్ సిక్స్ సభలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధానమైన హామీల గురించి ఒక్క మాటకూడా మాట్లాడలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి అన్నారు. రాయదుర్గంలో శుక్రవారం ఉదయం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, డివిజన్ కార్యదర్శి నాగార్జున తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో యువతకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైందని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేవలం కొన్ని సర్వీసులకే పరిమితం చేయడమేంటని మండిపడ్డారు.