చంద్రబాబు విధానాలను పిఠాపురం BSP ఇన్ఛార్జ్ ఖండవిల్లి లోవరాజు తీవ్రంగా ఖండించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరం కావాలనే ప్రయత్నాలను సహించేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.