భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైనార్టీ కళాశాల, పాఠశాల ముందు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జీతాలు చెల్లించాలంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టినట్లు అవుట్సోర్సింగ్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అవుట్సోర్సింగ్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగులు.