సంగారెడ్డి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మా ఇల్లు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బుధవారం టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్, కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, సహకార దర్శి తోపాజి హరీష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.