భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మల్లీశ్వరి కి వినతి పత్రం అందించినట్లు సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మల్లేష్ తెలిపారు.ఈసందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు జిల్లాలో అంగన్వాడీ నూతన భవనాలు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే రిపేర్ చేయించాలని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందించినట్లు తెలిపారు మారేపల్లి మల్లేష్.