హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలరెడ్డి మాట్లాడం తగదని హిందువులకు ఆమె క్షమాపణలు చెప్పాలని విహెచ్పి నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం రాయదుర్గంలో VHP పట్టణ అధ్యక్షులు మద్దిలేటి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు దేవిరెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మాదుగొండే మల్లికార్జున తదితరులు విలేకరులతో మాట్లాడారు. దళిత వాడల్లో TTD ఆలయాల నిర్మించడం హర్షనీయమన్నారు.