శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని రాచువారిపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం వైద్య అధికారి ముని చంద్రిక ఆదేశాలతో సిబ్బంది సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలు, నీటి తొట్టిలను వారానికి ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. దోమలతో విషజ్వరాలు వ్యాపించే ప్రమాదముందని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.