రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని CPM పాతపట్నం నియోజకవర్గ కార్యదర్శి సిర్ల ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కొత్తూరు మండల పరిధిలో సుమారు 16 వేల హెక్టార్లలో రైతులు ఓరి పండిస్తుంటే వారికి కావలసిన ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మరోవైపు అధికారులు రాజకీయ నాయకులు రైతులకు ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటనలు చేస్తున్నారే తప్ప అందించడం లేదని వాపోయారు.