నల్లగొండ పట్టణ శివారులోని పానగల్లులో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఇరువు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత కు శనివారం అర్ధరాత్రి దారి తీసింది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది కొంతమంది యువకులు మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు ఘటన జరిగిన సమయంలో అక్కడ ఒకే కానిస్టేబుల్ ఉండడంతో పరిస్థితి అదుపుతప్పింది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చెదరగొట్టారు.