రాం గోపాల్పేట డివిజన్లోని విక్టోరియా గంజ్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని రోడ్లపై మురుగునీరు పారి ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అలాగే సరైన రోడ్లు లేవని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.