వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రా నగర్ కాలనీ 9వ వార్డులో దళిత వాడ ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గారు మరియు మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు బోయ రామకృష్ణ కాలనీలో పర్యటించారు. వారు మాట్లాడుతూ గతంలో పలు వార్డుల వారీగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపాలిటీ కమీషనర్ కార్యాలయంలో వినతిపత్ర రూపంలో అందచేశారు. రామచంద్రా నగర్ కాలనీలో దళిత వాడలో ప్రజలు మిషన్ భగీరథ నీళ్ళు సరిగ్గా రావడం లేదని త్రాగడానికి మంచి నీరు లేదని , నిత్యావసరాల కొరకు నీళ్ళు లేవని, మనిషి చనిపోయిన తర్వాత స్నానం చేయించడానికి నీళ్లు లేవని మండిపడ్డారు