జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మంగళవారం ఉదయం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలగని రాజు మాట్లాడుతూ బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి వరకు ఎదిగారంటే అది ఆయన చేసిన సేవలను పార్టీతో పాటు ప్రజలు గుర్తించారనే విషయాన్ని మరిచిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దొంగ ఓట్లతో బండి సంజయ్ గెలిచారు అని మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.