పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని వినాయకుని నిమజ్జనం కోసం స్థానికులు ఊరేగింపుగా వెళ్తుండగా అతి వేగంగా వచ్చిన స్కార్పియో వారి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు స్కార్పియో వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు