రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన మెగా డీఎస్సీ ఫలితాలు కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కుమ్మర గంగాధర రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. 86.5 మార్కులు సాధించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని కైవసం చేసుకున్నాడు. కుమ్మర గంగాధర ప్రభుత్వ టీచర్గా ఎంపిక కావడంతో స్నేహితులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.