ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. మంగళవారం ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండల గ్రామాల్లో వివిధ రకాలుగా జనసేన శ్రేణులు, మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సేవాకార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా భీమడోలు మండలంలోని పూళ్ల, భీమడోలు, గుండుగోలను, ఆగడాలలంక గ్రామాలకు భారీ బైక్ ర్యాలీగా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తరలివెళ్లారు.