డీఎస్సీ ఉద్యోగం తో పాటు పోలీస్ అర్హత సాధించిన అభ్యర్థుల నుండి ఏపీ ఎస్ ఎల్ ఆర్బి వారు అన్విల్లింగ్ లెటర్ తీసుకోగలిగితే, ఆ రకంగా మిగిలిన ఉద్యోగాలను మిగతా అభ్యర్థులకు కేటాయించవచ్చు, లేనిచో అవి క్యారీ ఫార్వర్డ్,బ్యాక్లాగ్ గా మిగిలిపోతాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని కోరారు. ఇప్పటికే గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వివక్ష వల్ల ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం గానీ, ఒక్క డీఎస్సీ ఉద్యోగం గానీ నింపలేదు, దీనివల్ల అభ్యర్థులు ఐదేళ్లు సమయం వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.