భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సభను జయప్రదం చేయాలని పామర్తి సత్యనారాయణ అన్నారు. నిడదవోలు రాయపేటలో ఉషశ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వద్ద యూనియన్ నాయకులు మలేటి రామిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ పామర్తి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సెప్టెంబర్ 14న నిడదవోలు జిల్లా మహాసభ నిర్వహించినట్లు దానిని జయప్రదం చేయాలని కోరారు.