కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలో పేదరికంతో అల్లాడుతున్న చిర్రా సత్యనారాయణమ్మ మరియు చిర్రా స్వామి కుటుంబాలను పీ4లో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దత్తత తీసుకున్నారు. నెలనెలా వారికి రూ.3వేలు ఆర్థిక సహాయంగా అందించనున్నారు. పీ4 పథకం విజయవంతం అయ్యేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.