ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.మంత్రి ధంసలాపురం వద్ద ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్ఓబి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి పరిశీలించారు.