మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా విశ్వభారతి స్కూల్లో స్థానిక బీజేపీ నాయకులు, కార్య కర్తలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విపత్తులు, ఇతర కీలక అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారని తెలిపారు.