గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పీరుబండి జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి, జడ్పిటిసి వర్రి నరసింహమూర్తి, వైసిపి గంట్యాడ మండల అధ్యక్షుడు జె అప్పారావు, వైసిపి సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.