ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో కొండచిలువ హల్చల్ చేసింది. చివరకు దాన్ని స్థానికులు కర్రలతో కొట్టి హతమార్చారు. భీమడోలు రోడ్డులో మార్కెట్ యార్డ్ సమీపంలో సుమారు పది అడుగుల పొడవు గల భారీ కొండచిలువ సోమవారం తెల్లవారుజామున రోడ్డును దాటుతుంది. ఆ సమయంలో భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమల వస్తున్న వాహనదారులకు ఆ కొండచిలువ కంటపడింది. దాంతో వారు భయభ్రాంతులకు గురై వెంటనే స్థానికులకు విషయం తెలిపారు. ఎవరి మీదనైనా దాడి చేస్తుందేమోనని భయంతో స్థానికులు వాహనదారులు కలిసి కర్రలతో ఆ భారీ కొండచిలోను కొట్టి హతమార్చారు.