వైసిపి చెత్త ప్రభుత్వమని నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ ఫైర్ అయ్యారు. మైపాడు గేట్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంటైనర్లను ఆయన పరిశీలించారు. పదిరోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్ళిందన్నారు. చెత్తపన్ను వసూలు చేసి చెత్త తొలగించటం మరిచిపోయిందని విమర్శించారు. అక్టోబర్ రెండో తేదీకల్లా చెత్త తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ తెలిపారు.