శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు సత్యసాయి జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం ప్రిన్సిపల్ జ్యోతి అధ్యక్షతన, పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఇంటి ఆవరణంలో ఒక మొక్కను నాటి వాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండాలన్నారు.పర్యావరణం పై విద్యార్థులకు ప్రతిజ్ఞ చేయించారు.