సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో బుధవారం వర్షాల పరిస్థితిని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న వాగులు రహదారులు మూసి వేయించాలని డిఎస్పీ వెంకటరెడ్డికి ఆదేశించారు. వారి వెంట నారాయణఖేడ్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ పీవీ చరణ్ రెడ్డి ఉన్నారు.