వనపర్తి జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఎదురుచూపులు గురువారం వనపర్తి జిల్లా అమరచింత మండలం పరిధిలోని రైతులు ఎరువుల కోసం యూరియా కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అమర్చింత రైతులు మాట్లాడుతూ భూమి మీద రైతులు బతికడమే కష్టమైపోయిందని ఆరుగాలం శ్రమించి పంటలు పండించేవారు ఇప్పుడు యూరియా ఎరువుల కోసం వేదన పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.