ప్రయాణికులు తమపై దాడి చేస్తే అధికారులు స్పందించి కేసులు నమోదు చేస్తే తమకు రక్షణ ఉంటుందని డ్రైవర్లు తెలిపారు. నిరసన తెలుపుతున్న డ్రైవర్లు బుధవారం మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎక్కడపడితే అక్కడ బస్సు ఆపాలని డిమాండ్ చేస్తున్నారని ఆపకుంటే దాడి చేస్తున్నారని తెలిపారు. దీనిపైన స్పష్టమైన హామీ వచ్చేంతవరకు తాము బస్సులు నడిపేది లేదని చెప్పారు. దీంతో 36 ప్రైవేట్ బస్సులు ఆగిపోయాయి.