స్వర్గీయ మాజీమంత్రి ఎం మాణిక్ రావు ఎందరో నాయకులకు రాజకీయ గురువని ఆయన సిద్ధాంతాలతోనే ముందుకు సాగుతున్నామని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు సోమవారం స్వర్గీయ మాణిక్యరావు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తాండూర్ పట్టణంలోని చించోలి రోడ్డు మార్గంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి హోదాలతో ఉన్న అదరక బెదరక బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేయాలని వారి అభివృద్ధికి అండగా నిలవాలని సిద్ధాంతం రాజకీయాలు నేర్పారని అన్నారు