భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుల ఏవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి అన్నారు. జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన బుధవారం పర్యటించారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో గల కజ్జర్ల, రుయ్యాడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులను కలిసి వారి పంట పొలాలను పరిశీలించి దైర్యం చెప్పారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు.