గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాధరపురానికి చెందిన జుట్రూ వెంకట రామారావు (29) ఈ నెల 29వ తేదీన విజయవాడ వెళ్తానని చెప్పి వెళ్లి, ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ చంటిబాబు తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులను విచారించినా ఆచూకీ లభించకపోవడంతో, ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామారావు సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సూచించారు.