అయినవిల్లి ఆది గణపతి నవరాత్రులు మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణా రావు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రములతో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందజేసారు.