సత్యవేడు: గురుకుల పాఠశాలను ఇంటర్ వరకు పెంచండి ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న సత్యవేడు జ్యోతిరావ్ పూలే బాలురు గురుకుల పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయిని పెంచాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను కోరారు. మంగళవారం తిరుపతికి విచ్చేసిన మంత్రి సవితను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలుసుకొని ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి గురుకుల పాఠశాల స్థాయి పెంపునకు తప్పక కృషి చేస్తానని తెలిపారు.