భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న 20 సీసీ కెమెరాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కావున గొర్లవీడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలోని గ్రామస్తులందరూ సహకరించుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా దొంగతనాలు, అఘాయిత్యాలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ సాంబమూర్తి గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.