శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వెంకటగిరి పాళ్యం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నూతన ఎల్లమ్మ గుడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి పాల్గొన్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ ప్రముఖులు, ప్రజలు, నాయకులు ఎంపీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.