ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ నుంచి ఓడవాడ వరకు గోదావరి కరకట్ట పలు ప్రాంతాల్లో కోతకు గురవుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం 15.70 మీటర్ల మేర నీటిమట్టం ఉందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.