తార్నాకలోని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాదిమంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. సుమారు ఒక లక్ష యాభై వేల కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని వారిపై వెన్న కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని తెలిపారు.