యాడికి మండలం చందన గ్రామంలో సోమవారం ఇద్దరు వ్యక్తులు పాము కాటుకు గురయ్యారు. గ్రామానికి చెందిన గోపాల్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ కూడా పాముకాటుకు గురి అయింది. గోపాల్, లక్ష్మీదేవి లను యాడికి ఆసుపత్రి నుంచి అనంతపురం రెఫర్ చేశారు. అయితే గోపాల్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు కర్నూలు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.