*అప్పుల బాధతో టైల్స్ షాపు యజమాని ఆత్మహత్యయత్నం* అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి టైల్స్ షాపు యజమాని దామోదర్ రెడ్డి మంగళవారం మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు సమాచారం అందుకున్న స్నేహితులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..