ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ అధికారులు రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను అమరావతిలో కలిసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఇటీవల దోర్నాల శ్రీశైలం శిఖరం సమీపంలో గస్తీ కాస్తున్న అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన విషయం తెలిసినదే. నిస్కారణంగా తమపై ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేయి చేసుకోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.