మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం అమలయ్యేందుకు కృషి చేయాలంటూ వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు