Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
యూరియాను అధికంగా వాడటం వలన కలిగే అనర్ధాలను అధికారులు ప్రజలకు వివరించాలని జిల్లా వ్యవసాయ అధికారిణి సత్యవాణి తెలిపారు. ఉదయగిరి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో 5 మండలాల వ్యవసాయ సిబ్బందితో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటల కోసమే యూరియాను అందిస్తామన్నారు. రైతుల అవసరాల కోసం యూరియాను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు.