ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అన్నదాత సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా అల్లూరి పోలేరమ్మ ఆలయం నుండి భారీ సంఖ్యలో మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటను నెరవేర్చడం జరిగిందన్నారు.