అల్లూరి జిల్లా పాడేరు పట్టణంలో గుడివాడ వీధి వద్ద సెల్ ఫోన్ లు దొంగలిస్తున్నారని అనుమానంతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో సావిటి వద్ద ఏర్పాటుచేసిన వినాయక ఉత్సవాల్లో భాగంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు మొబైల్ ఫోన్లు కనిపించకపోవడంతో సమీప ప్రాంతాల్లో వెతుకుతుండగా ఇద్దరు యువకులు వద్ద పోయిన రెండు ఫోన్లతో పాటు మరో మూడు ఫోన్లు ఉండడంతో ఇద్దరి యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి వద్ద నుండి వివరాలు సేకరిస్తున్నారు.