రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయిన్ పల్లిమండలం స్థంభంపల్లి గంజివాగు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారి భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిపివేసినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్,ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలిపారు.భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరం ఉంటే తప్పబయటకు రావద్దని ప్రజలకు వారు సూచించారు.