ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు నేడు మంగళవారం రోజున తెల్లవారుజామునుండే బారులు తీరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా బస్తాలు స్టాక్ వచ్చిందని తెలియడంతో వందలాది మంది రైతులు చుట్టుపక్కల గ్రామాల నుండి తెల్లవారుజామునే వచ్చి క్యూ కట్టారు. PACS కార్యాలయం వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.