శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లిలో భూ తగాదాలో రిపోర్టర్ సతీష్ బాబుపై అదే గ్రామానికి చెందిన నాగేంద్ర దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ఉన్నాయి పుట్టపర్తి మండల పరిధిలోని వీరాంజనేయపల్లిలో సర్వే నెంబర్ 518-1 లో 2.19 ఎకరాలను నాగేంద్ర దౌర్జన్యంగా జేసీబీతో శుభ్రం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సతీష్ బాబు తన అన్న కొడుకు ప్రశాంత్ తో కలిసి వారిని అడ్డుకోవడానికి వెళ్లారు. ఆర్డీవో కోర్టులో ఉన్న భూమిని ఏ విధంగా శుభ్రం చేస్తావు అని వారు నాగేంద్రను ప్రశ్నించారు.