అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు మండల కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఏర్పాటు చేసిన ఏపీయూడబ్ల్యూజే సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అరకు ఎంపీ చెట్టి తనుజ రాణిలు పాల్గొన్నారు. ముంచంగి పొట్టు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాడేరు, జిమాడుగుల, హుకుంపేట, పెద్దబయలు, ముంచంగి పొట్టు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని పాత్రికేయులు ఏ సందర్భంలోనూ అయినా సమస్య ఎదురైతే తమల సంప్రదించని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా సీనియర్ పాత్రికేయులను సత్కరించారు.