ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం గ్రామంలో ఇందిరమ్మ కాలనీ తదితర విధులలో వీధిలైట్లు వెలగక అంధకారంలో ఉంది. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే రోడ్డు మీద విష సర్పాలు లాంటివి ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు వెంట ఉన్న వీధి దీపాలను వెంటనే మరమ్మత్తులు చేయించి వీధి దీపాలు వెలిగేలా చూడాలని అహోబిలం గ్రామ ప్రజలు కోరుతున్నారు.