ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వమని నంద్యాల జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ధూపాటి మురళీధర్ చౌదరి పేర్కొన్నారు. మంగళవారం వెలుగోడు పట్టణంలో బీజేపీ నాయకులు, కార్య కర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పన్నులు భారీగా తగ్గించిందని, దీంతో ఈనెల 22 నుండి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని తెలిపారు.