Download Now Banner

This browser does not support the video element.

ముధోల్: భైంసా పట్టణంలోని మిర్జాపూర్ పీఏసీఎస్ సోసైటీకి సంబంధించిన గోదాము వద్ద యూరియా కోసం రైతుల తిప్పలు

Mudhole, Nirmal | Sep 13, 2025
నిర్మల్ జిల్లా : భైంసా పట్టణంలోని మిర్జాపూర్ పీఏసీఎస్ సోసైటీకి సంబంధించిన గోదాము వద్ద రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. శనివారం ఉదయం యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు బారులు తీరారు. క్యూలో గంటల తరబడి నిలబడి మరీ యూరియా తీసుకెళ్తున్నారు. 3 యూరియా బస్తాలకు ఒక నానో యూరియా తప్పని సరి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. చేసేదేమి లేక రైతులు యూరియా, నానో యూరియా తీసుకెళ్తున్నారు. ఉదయం నుంచే రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us